బాక్సాఫీస్ : వరల్డ్ వైడ్ “పొన్నియిన్ సెల్వన్” ఫస్ట్ డే కలెక్షన్ వివరాలు.!

ఒకప్పుడు తమిళ సినిమాల బాక్సాఫీస్ వేరే లెవెల్లో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం వారికి అనుకున్న రేంజ్ భారీ సక్సెస్ లు అయితే తగలట్లేదు. పైగా పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాల డామినేషన్ ఎక్కువ కావడం పైగా వసూళ్లు పరంగా కూడా మనవే ఉండడంతో తమిళ్ ఆడియెన్స్ మరింత సీరియస్ గా ఉన్నారు.

అయితే మన దగ్గర బాహుబలి లాంటి హిస్టారికల్ చిత్రాలు వచ్చిన తర్వాత మరిన్ని సినిమాలు ఆ తరహాలో వచ్చాయి. అలా తమిళ్ నుంచి కూడా వచ్చిన లేటెస్ట్ చిత్రమే “పొన్నియిన్ సెల్వన్ 1”. దర్శకుడు మణిరత్నం నుంచి తన కలల చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

ఎట్టకేలకు నిన్ననే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మిక్సిడ్ టాక్ ని తెచ్చుకుంది. అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం సత్తా చాటింది. వరల్డ్ వైడ్ అయితే మొదటి రోజు ఈ చిత్రం 80 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలిపారు.

అలాగే మన తెలుగులో కూడా ఈ చిత్రానికి సుమారు 6 కోట్ల దగ్గర గ్రాస్ మరియు మూడున్నర కోట్ల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. మొత్తంగా చూసినట్టు అయితే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయని చెప్పాలి కానీ ఈ టాక్ తో అయితే ఎంతవరకు వసూళ్లు వస్తాయో చూడాలి.