బాక్సాఫీస్ : మైండ్ బ్లాక్ చేస్తున్న “కార్తికేయ 2” వసూళ్లు..డీటెయిల్స్ చూడండి.!

Karthikeya 2 movie review

ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు హిట్ అంటే వసూళ్లు పరంగా చూస్తున్నారు కానీ ఒక నెల రోజులు థియేటర్ లో ఆ సినిమా ఉంది అంటే అది ఇక సెన్సేషనల్ హిట్ అనే చెప్పాలి. అలాంటి సినిమాలు ఇప్పుడు మన టాలీవుడ్ లో అది కూడా ఈ ఏడాదిలో చాలానే వచ్చేసాయి.

మరి ఈ చిత్రాల్లో గత ఆగస్ట్ 13న థియేటర్స్ లోకి వచ్చిన మోస్ట్ అవైటెడ్ సినిమా “కార్తికేయ 2” కూడా ఒక్కటి. థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్ నిఖిల్ సిద్ధార్థ హీరోగా అలాగే చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ క్రేజీ అడ్వెంచరస్ సీక్వెల్ పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ అందుకుంది.

తెలుగు మరియు హిందీ లోనే రిలీజ్ అయ్యినా ఈ సినిమా సక్సెస్ చూసి ఇతర భాషల్లో కూడా ఈ సినిమా ఇప్పుడు డబ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా వసూళ్లు కూడా ఊహించని లెవల్ కి చేరుకుంటున్నాయి. గత కొన్నాళ్ల కితమే నిఖిల్ తన కెరీర్ లో మొదట 100 కోట్ల గ్రాస్ సినిమాగా అందుకోగా..

ఇపుడు ఈ సినిమా ఏకంగా 120 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరుకున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు కన్ఫర్మ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రం ఇప్పటికీ వెయ్యి స్క్రీన్స్ లో రన్ అవుతుందట. ఇది కూడా మైండ్ బ్లాకింగ్ విషయం అని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.