బాక్సాఫీస్ : షాకింగ్ వసూళ్లు నమోదు చేస్తున్న “సీతా రామం”..2 రోజుల్లో ఎంతంటే.!

తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర ఒక్కసారిగా బిగ్ జంప్ నమోదు అయ్యిందని చెప్పి తీరాలి. ఈ శుక్రవారం రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీకి వచ్చాయి. అయితే ఈ రెండు చిత్రాలు “బింబిసారా” అలాగే “సీతా రామం” కాగా ఈ రెండు సినిమాలు కూడా సెపరేట్ సెపరేట్ గా మంచి వసూళ్లతో ట్రేడ్ వర్గాల వర్గాలకి షాకిస్తున్నాయి.

అయితే తెలుగులో ఎలాగో బింబిసారా డామినేషన్ ఉంటుంది కానీ చెబితే నమ్మరు ఆ సినిమా కన్నా దుల్కర్ నటించిన ప్యూర్ లవ్ స్టోరీ సీతా రామం షాకింగ్ వసూళ్లు నమోదు చేస్తుందట. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మైండ్ బ్లాకింగ్ వసూళ్లు నంబర్స్ ఈ చిత్రం సెట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

ఇక ఈ రెండు రోజులు అయితే ఏపీ తెలంగాణాలో ఈ చిత్రం మొదటి రోజు కంటే రెండో రోజే 50 లక్షలు ఎక్కువ రాబట్టిందని తెలుస్తుంది. దీనితో రెండు రోజుల్లో ఈ చిత్రం 3.6 కోట్ల షేర్ ని అలాగే ఆరున్నర కోట్ల మేర గ్రాస్ ని అందుకుందని తెలుస్తుంది.

ఇక యూఎస్ లో అయితే మరింత ఆశ్చర్యకరంగా భారీ జంప్ ఈ సినిమాకి దక్కింది. ఏకంగా మూడు రోజుల్లో 4 లక్షల డాలర్స్ ఈ సినిమా అందుకొని ఊహించని ఫీట్ సెట్ చేసింది. మరి ఇందులో ఈ ఒక్క శనివారమే 2 లక్షల డాలర్స్ కి పైగా వసూలు చేయడం మరో ఆశ్చర్యకర అంశం.

దీనితో అయితే ఈ చిత్రం రెండు రోజుల్లో అన్ని భాషలు కలిపి 13 నుంచి 14 కోట్ల షేర్ ని అందుకున్నట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ చేయగా రష్మికా మందన్నా కీలక పాత్ర చేసింది. అలాగే హను రాఘవపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.