Bimibisara Box Office : 4 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయంటే.!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరిన్ మరియు భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “బింబిసార” కోసం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో కావాల్సిన భారీ హిట్ ని ఈ చిత్రం అందుకొని కొత్త ఊపుని బాక్సాఫీస్ దగ్గర తీసుకొచ్చింది.

ఇక ఈ చిత్రం తెలుగు సహా ఓవర్సీస్ లో కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఒక భారీ గ్రాసర్ గా నిలుస్తుండగా ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలను ఈ చిత్రం అందిస్తుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా నాలుగు రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుస్తుంది.

ఈ చిత్రం ఈ నాలగవ రోజు అందులోని వర్కింగ్ డే అయినటువంటి సోమవారం రోజు అదిరే వసూళ్లు నమోదు చేసినట్టుగా ట్రేడ్ వర్గాల వారు తెలియజేస్తున్నారు. మరి వారు చెబుతున్న దాని ప్రకారం అయితే ఈ నాల్గవ రోజు బింబిసార 2.26 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చెయ్యగా నాల్గు రోజుల్లో ఈ చిత్రం 18.2 కోట్లకి పైగా షేర్ ని ఈ సినిమా అందుకుంది.

దీనితో ఈ సినిమా లాభాల బాట పట్టింది. ఇంకా ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి అద్భుతమైన సంగీతం అందించగా కొత్త దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించాడు. అలాగే ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు.