‘అంతరిక్షం‌’హడావిడి ఆగిపోయిందేం..రీజన్ ఏంటో

ఫిదా, తొలిప్రేమ చిత్రాల హిట్‌ తర్వాత మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్‌’. లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ హీరోయిన్స్ గా చేస్తున్నారు. తొలి చిత్రం ‘ఘాజీ’తో జాతీయ అవార్డు అందుకున్న సంకల్ప్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున ఈ సినిమా టీజర్‌ ఇప్పటికే విడుదల అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ వ్యోమగామిగా కనిపించనున్నారు.

ఇక ఈ చిత్రం డిసెంబర్‌ 21న విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా ప్రమోషన్ ప్లాన్స్ ఏమీ కనపడటం లేదు. అయితే ఈ చిత్రం ఆ తేదీకు విడుదల కాదని అందుకే సైలెంట్ అయ్యారని అంటున్నారు. కానీ ఇప్పటివరకూ అటు వంటి ప్రకటన ఏమీ లేదు. లాస్ట్ రెండు వారాలు పబ్లిసిటీ చేస్తే చాలని భావిస్తున్నారని అందుకే ఆపేసారని మరికొంతమంది అంటున్నారు.  అబ్బే అదేమీ కాదు..అవుట్ పుట్ సరిగ్గా రాలేదు..రీషూట్ చేస్తున్నారు..అందుకే లేటు అయ్యేటట్లు ఉంది. దానికి తోడు గ్రాఫిక్స్ కూడా అనుకున్న టైమ్ లో పూర్తయ్యేటట్లు లేవు అని కొందరంటున్నారు.  వీటిల్లో ఏదీ నిజం…అనేది తెలియాలి.

ఇక ఈ చిత్రం రిలీజ్‌ అయిన తరువాత తక్కువ గ్యాప్‌లోనే వరుణ్ తేజ మరో చిత్రతం‘ఎఫ్‌2’ చిత్రం కూడా విడుదల కానుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఒకటి సైన్స్‌ ఫిక్షన్‌ కాగా, రెండోది మాస్‌ ఎంటర్‌టైనర్‌ .