అఖిల్ కు మొదటి రెండు చిత్రాలు డిజాస్టర్స్ కావటంతో మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’ పైనే ఆయన నమ్మకాలు పెట్టుకున్నారు. అయితే ఆ నమ్మకాలు ఏమీ నిజం కాలేదు. ‘మిస్టర్ మజ్ను’ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యిపోయింది. అయితే ఈ సినిమాపై ఎంత బిజినెస్ జరిగింది. క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత..నష్టం ఎంత వచ్చింది అనేది ట్రేడ్ లో లెక్కలు తేలాయి.
`మిస్టర్ మజ్ను` ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంటే మినిమం 25 కోట్లు మేరకు అయినా కలెక్షన్స్ వస్తే ఒడ్డున పడి, హిట్ కొట్టినట్లు అని అంచనాలు వేసారు. అయితే కేవలం నలభై శాతం మాత్రమే రికవరీ అయ్యింది. 11.15 కోట్లు మాత్రమే వెనక్కి తిరిగి వచ్చినట్లు సమాచారం.
ప్రీ రిలీజ్ బిజినెస్ …(ఏరియా వైజ్)
నైజాం-3.30 కోట్లు
సీడెడ్ -1.40కోట్లు
ఉత్తరాంధ్ర-1.25 కోట్లు
తూ.గో. జిల్లా- 0.65 కోట్లు
గుంటూరు- 0.95 కోట్లు
కృష్ణ- 0.80 కోట్లు
ప.గో.జిల్లా- 0.50 కోట్లు
నెల్లూరు -0.34లక్షలు
ఏపీ – నైజాం కలుపుకుని 9.19 కోట్లు
భారత్ లో మిగతా ప్రాంతాల్లో 1.20 కోట్లు
అమెరికా కలుపుకుని ఓవర్సీస్ లో 0.75 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 11.14 కోట్లు
అఖిల్ అక్కినేని హీరోగా ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారీ చిత్రాన్ని.
అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.