బ్యాక్ టు బ్యాక్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌ మూవీస్‌!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో కాస్త అటు, ఇటుగా ఒకే క‌థాంశంతో రెండు మూవీలు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఒక‌టి జెర్సీ, రెండోది మ‌జిలీ. ఈ రెండు సినిమాల బ్యాక్‌డ్రాప్ క్రికెట్టే. జెర్సీలో నాని, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌జిలీలో నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంషా కౌశిక్ న‌టిస్తున్నారు. సంక్రాంతి పండుగ‌కు మూడురోజుల కింద‌టే జెర్సీ టీజ‌ర్ విడుద‌లైంది.

సోమ‌వారం మ‌జిలీ లుక్‌ను ఆవిష్క‌రించారు. స్పోర్ట్స్ డ్రెస్‌లో క‌నిపించాడు. నాగ‌చైత‌న్య‌, దివ్యాంషా కౌశిక్‌లు ఉన్న లుక్ ఇది. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. ఇదివ‌ర‌కు శివ నిర్వాణ `నిన్నుకోరి` మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 5న సినిమా విడుద‌ల కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం.