‘గ్యాంగ్ లీడర్’అమెరికాలో పరిస్దితి ఏంటి
ఈ రోజు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ధియోటర్స్ లో దిగింది. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ కొట్టిన నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో చేసారు. అంతేకాదు, థియేటర్‌లో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తానని హామీ కూడా ఇచ్చాడు. నానికి తోడు విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా జతకలవటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే బాక్సాఫీస్ రేసులో పెద్దగా పోటీ కూడా లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో డీసెంట్ కలెక్షన్లు నమోదయ్యినట్లు సమాచారం.
మొదటి నుంచీ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ కలిగిన హీరోల్లో నాని ఒకరు. ఆయన గతంలో నటించిన పలు చిత్రాలు అక్కడ 1 మిలియన్ మార్క్ అందుకున్నాయి. అందుకు కారణం నాని సినిమాలన్నీ యూఎస్ఏ తెలుగువారు ఎక్కువగా ఎలిమెంట్స్ కలిగి ఉండటమే.
అలాగే 200 స్క్రీన్లలో యూఎస్ఏ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇండియాలో విడుదలకు ఒక రోజు ముందే అక్కడ భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలు వేశారు. అడ్వాన్స్ బుకింగ్ అదే స్థాయిలో జరిగింది. చాలా చోట్లు ప్రీమియర్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.
యూఎస్ఏ బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… నాని కెరీర్లో హయ్యెస్ట్ ప్రీమియర్ షో కలెక్షన్లు సాధించిన 2వ చిత్రంగా ‘గ్యాంగ్ లీడర్’ నిలిచింది. 177 లొకేషన్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం $182,679 వసూలు చేసినట్లు తెలుస్తోంది. నాని గత చిత్రం ‘ఎంసీఏ’ $304,000 వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది.