శర్వా ‘రణ రంగం’ ప్రి రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు చేసారంటే…
‘కొందరికి అతను నేరస్థుడు. మిగిలిన వారికి అతను హీరో’ అంటూ 90ల నాటి కాలం కథతో వస్తున్న చిత్రం ‘రణ రంగం’. సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్. టీజర్ , ట్రైలర్స్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం రేపే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఏ మేరకు బిజినెస్ చేసింది వంటి విషయాలు చూద్దాం.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ..16 కోట్లు దాకా చేసింది. అంటే 17 కోట్లు అయినా షేర్ వస్తే సేఫ్ వెంచర్ అవుతుంది. శర్వానంద్ మార్కెట్ కు అది కాస్త ఎక్కువే అనిపించినా…సినిమాకు ఉన్న టాక్ ని బట్టి కష్టమేం కాదు అంటున్నారు. ఏరియాల వారిగా ఈ చిత్రం బిజినెస్ చూద్దాం.
ఏరియా బిజినెస్ (కోట్లలో)
——————– —————————————-
నైజాం 5.00
సీడెడ్ 2.00
నెల్లూరు 0.50
కృష్ణా 1.00
గుంటూరు 1.20
వైజాగ్ 1.50
ఈస్ట్ గోదావరి 1.00
వెస్ట్ గోదావరి 0.80
ఆంధ్రా మరియు తెలంగాణా 13.00
కర్ణాటక 0.90
భారత్ లో మిగతా ప్రాంతాలు 0.30
ఓవర్ సీస్ 1.80
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ 16.00