కారుతో బైకు ని గుద్దేసిన హీరోయిన్, ఓ వ్యక్తి మృతి

బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ లేచిన వేళ బాగున్నట్లు లేదు. గోవాలో ఆమె ప్రయాణిస్తున్న కారు… బైక్‌పై వెళుతున్నఒక యువకుడిని ఢీ కొంది. మొదట ప్రాణనష్టం జరగలేదు కానీ బైక్ ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి సీరియస్ అయ్యింది…రికవరీ అవుతాడు అనుకున్నారు. కానీ అతని అతి కొద్ది సేపట్లోనే ప్రాణం పోయింది.

యాక్సిడెంట్ అయిన వెంటనే స్పందించిన జరీన్‌ఖాన్‌తో పాటు ఆమె మనష్యులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి బైక్ డివైడర్‌ను ఢీకొంది. దీంతో అతని తలకు తీవ్రంగా గాయమవటమే మరణానికి కారణమైంది.

ఇక జరీన్‌ఖాన్ హీరో సల్మాన్‌తో 2010లో ‘వీర్’ సినిమాతో పరిచయమైంది. జరీనాఖాన్ హిందీతో పాటు తమిళం, పంజాబీ సినిమాల్లో కూడా నటించింది. భారీ అందాల భామ జరీన్‌ఖాన్ హాట్ హాట్‌గా తెరపై అందాల ఆరబోతకి ‘సై’ అన్నా పెద్దగా కలిసిరాలేదు. ‘హేట్ స్టోరీ 3’ సినిమాలో చాలా హాట్‌గా తన అందాలు పరిచింది జరీన్‌ఖాన్. ఆ సినిమా కూడా ఆమె కెరీర్ కు పెద్దగా ప్లస్ కాలేదు.