ఆ హీరోయిన్ ఎంజాయ్ మెంట్ వల్లే నా సోదరుడు చనిపోయాడు

బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌పై కేసు నమోదైంది. ఆమె డ్రైవర్ ని అరెస్ట్ చేసారు. సొంత పని నిమిత్తం గోవాలో ఉంటున్న జరీన్‌ గురువారం తన కారులో ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను ఈమె వాహనం ఢీకొన్న సంగతి తెలిసిందే. స్కూటర్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

దాంతో జరీన్‌పై, ఆమె కారు నడుపుతున్న డ్రైవర్‌ అబ్బాస్‌పై చనిపోయిన వ్యక్తి సోదరుడు విశాల్ పనాజీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ సమయంలో జరీన్‌ కారు వేగంగా వెళుతోందని, తన ఎంజాయ్‌మెంట్‌ కోసం తన సోదరుడిని బలితీసుకుందని విశాల్‌ బాధపడ్డారు.

కారు ప్రమాదానికి గురైన సమయంలో జరీన్‌ డ్రైవర్‌ పక్కనే కూర్చున్నారని, వేగంగా వెళుతున్నప్పుడు ఆమె డ్రైవర్‌ను హెచ్చరించలేదని అన్నారు. ఈ మేరకు పనాజీ పోలీసుల జరీన్‌, అబ్బాస్‌పై కేసు నమోదు చేశారు. వారిద్దరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

ఇక జరీన్‌ఖాన్ హీరో సల్మాన్‌తో 2010లో ‘వీర్’ సినిమాతో పరిచయమైంది. జరీనాఖాన్ హిందీతో పాటు తమిళం, పంజాబీ సినిమాల్లో కూడా నటించింది. భారీ అందాల భామ జరీన్‌ఖాన్ హాట్ హాట్‌గా తెరపై అందాల ఆరబోతకి ‘సై’ అన్నా పెద్దగా కలిసిరాలేదు. ‘హేట్ స్టోరీ 3’ సినిమాలో చాలా హాట్‌గా తన అందాలు పరిచింది జరీన్‌ఖాన్. ఆ సినిమా కూడా ఆమె కెరీర్ కు పెద్దగా ప్లస్ కాలేదు.