పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’.2017లో వచ్చిన ‘కాటమరాయుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించారు. తమిళంలో అజిత్ నటించిన ‘వీరం’కు ఈ సినిమా రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం పవన్ ఇమేజ్ కు తగినట్లు లేక చతికిల పడింది. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
ఈ రీమేక్ లో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఇందులో హీరోగా నటించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. తొలుత ఈ పాత్రలో అక్షయ్ కుమార్‌ను ఎంపిక చేసుకోవాలనకున్నారు. కానీ అక్షయ్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో విక్కీని సంప్రదించారట. అన్నీ అనుకున్నట్లు కుదిరితే సినిమాకు సాజిద్ నదియాద్వాలా నిర్మాతగా వ్యవహరిస్తారు.
అలాగే ఈ సినిమాకు ‘ల్యాండ్ ఆఫ్ లుంగీ’ అనే ఫన్నీ టైటిల్‌ను ఖరారు చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటోంది. దీని గురించి దర్శక,నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.