భారీ అంచనాలు ఉన్న “బ్రహ్మాస్త్ర” ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..!

ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఎన్నో అసలు పెట్టుకున్న ఒకే ఒక్క సినిమా “బ్రహ్మాస్త్ర”. బాలీవుడ్ స్టార్ దర్శకుడు అయాన్ అలాగే అక్కడి స్టార్ జంట రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకంతోనే ఉన్నారు.

అయితే ఈ సినిమా ఫైనల్ గా ఈరోజు వరల్డ్ వైడ్ సుమారు 8000 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ అనేక చోట్ల సినిమా షో లు కూడా పడిపోయాయి. ఇక ఓవరాల్ గా సినిమాకి ఎలాంటి టాక్ మరియు రివ్యూ లు వినిపిస్తున్నాయో తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టు అయితే బ్రహ్మాస్త్ర కి మిక్సిడ్ టాక్ ఎక్కువగా కనిపిస్తుంది.

భారీ హిట్ అని కొందరు అంటుంటే మరికొందరు సినిమా బాగాలేదు అనేస్తున్నారు. దీనితో ఈ సినిమాకి ఫస్ట్ డే మిక్సిడ్ టాక్ తోనే మొదలయ్యింది. సినిమాలో గ్రాండ్ విజువల్స్, ఏక్షన్ అంతా బాగానే ఉంది కానీ సరైన ఎమోషన్స్ సినిమాలో లేవట దీనితో ఇది దెబ్బ తీసింది అని కొందరు ప్రముఖ క్రిటిక్స్ అంటున్నారు.

దీనితో అయితే బ్రహ్మస్త్ర సినిమాకి ఇలాంటి టాక్ దక్కింది. ఇక ఈ భారీ సినిమాలో అయితే అక్కినేని నాగార్జున అమితాబ్ బచ్చన్ అలాగే షారుఖ్ ఖాన్ లాంటి ఎందరో బిగ్గెస్ట్ స్టార్స్ కూడా కనిపించనున్నారు.