క్రేజీ అప్డేట్ : రజినీకాంత్ సినిమా కోసం రంగంలోకి ఈ దిగ్గజ దర్శకుడు..!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని ఎప్పుడో ఓ రేంజ్ లో విస్తరించిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది తలైవర్ రజినీకాంత్ మాత్రమే. ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా రజిని క్రేజ్ ఓ లెవెల్లో ఉంటుంది. తాను చేసిన ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ చిత్రాల్లో అయితే దర్శకుడు కె ఎస్ రవికుమార్ తో చేసిన సినిమాలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది.

అలాంటి దర్శకుడు మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత రజినీకాంత్ చేయబోతున్న 169వ సినిమా కోసం రంగం లోకి దిగుతున్నట్టు ఇప్పుడు క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. అయితే ఇపుడు రజినీకాంత్ తమిళ్ లో “డాక్టర్”, రీసెంట్ గా “బీస్ట్” సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ భారీ పాన్ ఇండియన్ సబ్జెక్టు చేస్తున్నారు.

దీనికి గాను ఇప్పుడు కె ఎస్ రవికుమార్ ని కూడా ఒక భాగంగా తీసుకుంటున్నట్టు భారీ అనౌన్సమెంట్ ని అందించారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకి తాను స్క్రీన్ ప్లే అందిస్తారని బజ్ ఉంది అలాగే కీలక పాత్రలో ఏమన్నా నటిస్తారా అనేది కూడా వినిపిస్తుంది.

మొత్తానికి అయితే ఈ క్రేజీ అనౌన్సమెంట్ తో మాత్రం ఈ చిత్రం ఇప్పుడు సినీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ మరియు ఏ జి ఎస్ సినిమాస్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

https://twitter.com/agscinemas/status/1534046587436994561