ఇండస్ట్రీ టాక్ : తన సినిమా హిందీ రీమేక్ లో గెస్ట్ గా సూర్య అట.!

Suriya did good job by doing Surarai Pottru

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడైన సూర్య శివకుమార్ హీరోగా నటించిన అల్టెస్ట్ చిత్రం “ఈటి” తన కెరీర్ లో అనుకోని ప్లాప్ గా నిలిచింది. అప్పటికే రెండు సినిమాలు ఓటిటి లో వచ్చాయి మంచి హిట్ కూడా అయ్యాయి. కాకపోతే ఆ రెండు సినిమాలు కూడా క్లాస్ సినిమాలు కావడంతో మాస్ ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూసారు కానీ అది ప్లాప్ అయ్యింది. 

అయితే లేటెస్ట్ గా వచ్చిన “విక్రమ్” తో మాత్రం కనిపించిన 5 నిముషాలు తాను అదరగొట్టేసాడు. దీనితో అంతా మళ్ళీ సూర్య నామ స్మరణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సూర్య నటించిన “సూరారై పొట్రు” తెలుగులో ఆకాశం నీ హద్దురా అని రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. అయితే ఇపుడు ఈ సినిమాని ఇదే చిత్రం దర్శకురాలు సుధా కొంగర హిందీలో హీరో అక్షయ్ కుమార్ తో చేస్తున్నారు. 

మరి ఇక్కడే ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ చిత్రంలో సూర్య గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట. ఇది ఒకింత విడ్డురంగా ఉంది కానీ సూర్య తన సినిమా రీమేక్ లో తాను ఓ రోల్ చేస్తుండడం అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో అయితే ఇదే హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. మరి ఆల్రెడీ విక్రమ్ లో కనిపించి ఆకట్టుకున్న సూర్య ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడో చూడాలి అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.