సన్నిలియోన్ తో తమిళ ఎన్టీఆర్ స్టెప్ లు

హీరోయిన్ గా సన్నిలియోన్ సక్సెస్ కాకపోయినా ఐటం సాంగ్ లకు మాత్రం ఆమె పెట్టింది పేరు. ఆమెకు ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకుందామనుకుంటున్నారు విశాల్. ఆయన హీరో గా రూపొందే చిత్రంలో సన్నిలియోన్ చేత ఐటం సాంగ్ లాంటిది చెయ్యించబోతున్నారు. ఆ పాట సినిమాకు హైలెట్ అయ్యేలా మాస్ ట్యూన్స్ తో , మాస్ స్టెప్స్ తో డిజైన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు..మన తెలుగులో ఘన విజయం సాధించిన టెంపర్ రీమేక్.

వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్- పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఘన విజయం సాధించింది. ప్లాఫ్ ల్లో ఉన్న ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించింది. దాంతో విశాల్ సైతం ఈ సినిమాని రీమేక్ చేసి తన కెరీర్ ని తిరిగి ట్రాక్ లో పెట్టాలనుకుంటున్నారు.

ఈ చిత్రం తమిళ్ రీమేక్ లో విశాల్ మరియు రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే కీలక షెడ్యూల్ ను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం బిజినెస్ వర్గాల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య సాగే కొన్ని సీన్స్ ని రీరైట్ చేసి తెరకెక్కించారని, అవి హైలెట్ అవుతాయని అంటోంది చిత్రయూనిట్.

ఇక తమిళ సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉందట, ఆ సాంగ్ లో విశాల్ సరసన సన్నీలియోన్ స్టెప్పులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సన్నీలియోన్ చిత్ర యూనిట్ కి ఫలానా రోజు నుంచి చేసుకోమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రాశి ఖన్నా హీరోయిన్ గా వచ్చే ఈ సినిమా పొంగల్ కు రిలీజ్ కాబోతున్నది.

ఎ.ఆర్ మురుగదాస్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘అయోగ్య’ అనే పేరు పెట్టారు.