కియారా అద్వానీ లిప్ లాక్..లీక్‌!

కియారా అద్వానీ. టాలీవుడ్‌లో తారాజువ్వ‌లా దూసుకొచ్చిన న్యూ జ‌న‌రేష‌న్ హీరోయిన్‌. న‌టించింది రెండే సినిమాల్లో అయినా ప్రేక్ష‌కుల‌ను, ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను త‌న వైపున‌కు తిప్పుకొంది. మ‌హేష్‌బాబు స‌ర‌స‌న `భ‌ర‌త్ అనే నేను`, రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న `విన‌య విధేయ రామా`లో న‌టించింది. మ‌రిన్ని సినిమాల‌కు సైన్ చేయ‌నుంది.

తాజాగా ఆమె ఓ బాలీవుడ్ సినిమాలో న‌టిస్తోంది. మూవీ పేరు `క‌బీర్ సింగ్‌.` అది మ‌న తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ `అర్జున్‌రెడ్డి`కి రీమేక్‌. సందీప్ వంగా ద‌ర్శ‌కుడు. కిస్సింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న షాహిద్ క‌పూర్ ఇందులో క‌థా నాయ‌కుడు. అత‌నితో క‌లిసి కియారా తెర‌ను పంచుకుంటోంది. అర్జున్ రెడ్డిలో బోల్డ్ సీన్స్ ఉన్నాయి. బాలీవుడ్‌లో షాహిద్‌కు రొమాంటిక్ హీరోగా పేరుంది.

సో- క‌బీర్ సింగ్ కూడా జ‌నాన్ని హీటెక్కించేదే. షాహిద్ కపూర్‌-కియారా అద్వానీల‌కు సంబంధించిన లిప్ లాక్ స‌న్నివేశం ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ స‌మీపంలో కొన్ని సీన్ల‌ను తెర‌కెక్కించారు. ఈ లిప్ లాక్ సీన్ కూడా అక్క‌డ చిత్రీక‌రించిందే.

యూనివ‌ర్శిటీ ప‌రిస‌రాలు కావ‌డం వ‌ల్ల సినిమా షూటింగ్ చూడ్డానికి చాలా మంది యువ‌కులు ఎగ‌బ‌డ్డార‌ట‌. ఆ సంద‌ర్భంగా కొంద‌రు లిప్ లాక్ స‌న్నివేశాన్ని త‌మ మొబైల్ ఫోన్ల‌లో బంధించారు. దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటివి కొన్ని సీన్లు లీక్ కావ‌డం ప‌ట్ల చిత్రం యూనిట్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.