పెళ్ళైన రెండు నెలలకే ప్రెగ్నెంట్ అయ్యిన “RRR” హీరోయిన్..నెటిజన్స్ ఫన్ ట్రోల్స్!

ఒకరి పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూడడం అనేది మరీ అంత సమంజసం కాదు కానీ వాటిని వారే బహిర్గతం చేసుకుంటే మాత్రం అందరూ మాట్లాడుకోక తప్పదు. ఇప్పుడు అలాగే ఓ షాకింగ్ అంశం సోషల్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. బాలీవుడ్ కి చెందిన స్టార్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్ తన ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేయడం అందరిలో షాకింగ్ గా మారింది. 

భారీ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) చిత్రం ప్రమోషన్స్ లో కూడా మొన్ననే పాల్గొన్నట్టు అనిపించింది. హీరో రణబీర్ కపూర్ తో కూడా పెళ్లి మొన్న మొన్ననే అయినట్టు అందరికి అనిపిస్తుంది. ఈ గ్యాప్ లో అప్పుడే తాను ప్రెగ్నెంట్ అంటూ ఆలియా అనౌన్స్ చేయడం నెటిజన్స్ ని ఫన్నీ గా షాక్ కి గురి చేసింది. 
రెండు నెలల పెళ్ళికే ప్రెగ్నెన్సీ ఏంటని రణబీర్ ని ట్యాగ్ చేసి ఫన్నీ గా క్వశ్చన్ చేస్తున్నారు.

అంతే కాకుండా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య కూడా తన పెళ్లి అయ్యి వారికి బాబు పుట్టడం కూడా షాకింగ్ గానే జరిగింది. ఈ రెండు ఇన్సిడెంట్స్ మాత్రం అందరినీ షాక్ కి లోను చేశాయని బి టౌన్ ట్రోల్ పేజెస్ మరియు హిందీ జనం మంచి ఫన్నీ ట్రోల్స్ వేస్తుండగా ఆలియా ప్రెగ్నెన్సీ న్యూస్ మాత్రం ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.