జీరో సినిమాలో షారుక్ ,సల్మాన్ పాట

షారుక్ ఖాన్  ,కత్రినా కైఫ్, అనుష్క శర్మ  నటిస్తున్న  “జీరో ” సినిమా థియేటర్ ట్రైలర్ విడుదలై అభిమానులను అలరిస్తుంది . ఇప్పుడు తాజాగా షారుక్ ఖాన్, సల్మాన్ కలసి నటించిన ఓ పాటను మంగళవారం నాడు రిలీజ్  చెయ్యబోతున్నారు . ఆనంద్ రాజ్ దర్శకత్వంలో గౌరీ ఖాన్ రూపొందిస్తున్న సినిమా “జీరో “

సల్మాన్ ఖాన్ , షారుక్ ఖాన్ ఇద్దరు నటించిన పాట  అనగానే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు . ఈ ఇద్దరు సూపర్ స్టార్లు “ట్యూబెలైట్ ” సినిమా తరువాత కలసి నటించిన సినిమా ఇది . షారుక్  ఖాన్  ఈ సినిమాలో మరుగుజ్జు గా నటిస్తున్నాడు . పైగా ఇది అతని స్వంత సినిమా .

సల్మాన్ ఖాన్ , షారుక్ ఖాన్ ను ఎత్తుకున్న ఫోటో ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్నది . జీరో సినిమా వచ్చే నెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నది .