సల్మాన్ ‘భారత్’ ట్రైలర్‌ టాక్

సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భారత్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. Ode To My Father అనే కొరియా చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ను ఐదు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. అవన్ని చూపిస్తూ వచ్చే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి .

అలీ అబ్బాస్‌ జాఫర్‌ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌, దిశా పటానీ హీరోయిన్స్ . గవర్నమెంట్ ఉద్యోగస్దురాలిగా కత్రినా పాత్ర, లుక్‌ ఆకట్టుకుంటోంది. సల్మాన్‌ ఉద్యోగం నిమిత్తం కత్రినా పనిచేస్తున్న ఆఫీస్ కి వెళతారు.

BHARAT | Official Trailer | Salman Khan | Katrina Kaif | Movie Releasing On 5 June 2019

 ‘మీ పేరేంటి?’ అని కత్రినా అడిగినప్పుడు.. ‘భారత్‌’ అని సల్మాన్‌ సమాధానమిస్తారు. అది విని కత్రినా షాకవుతారు. ‘దేశంపై ప్రేమతో మా నాన్న నాకు ‘భారత్‌’ అని పేరుపెట్టారు. ఆ పేరుకు ముందు, వెనక మరో పేరును జోడిస్తే.. దేశాన్ని అవమానించినట్లు అవుతుంది కదా..’ అంటూ సల్మాన్‌ అమాయకంగా చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది.

సర్కస్‌లో ఫీట్లు చేసే పాత్రలో‌, కత్రినా కైఫ్‌తో ప్రేమ సన్నివేశాల్లో, కార్మికుడిగా, నావీ ఆఫీసర్‌గా ఇలా ప్రతీ పాత్రలో సల్మాన్‌ యాక్టింగ్‌ అదిరిపోయేలా ఉంది. భారత్‌ అనే వ్యక్తి దేశంతో కలిసి చేసిన ప్రయాణం ఎలాంటిది? అన్న నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.