అడ్డంగా బుక్కయిన భాయ్ మాజీ సెక్యూరిటీ గార్డ్
అతడు ముంబై మొరాదాబాద్ రోడ్లపై నానా రచ్చ చేశాడు.. నడిరోడ్డుపై అతడి వీరంగం సంచలనమైంది. దారిన వస్తున్న వాహనాల్ని ఆపి.. దొరికినవాళ్లందరినీ ఇష్టానుసారం చితక్కొట్టి నానా రచ్చ చేశాడు. ఇంతకీ అతడు ఎవరు.. ఎందుకిలా ప్రవర్తించాడు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
సల్మాన్ భాయ్ మాజీ సెక్యూరిటీ గార్డ్ అనాస్ ఖురేషి ముంబై మొరాదాబాద్ రద్దీ ఏరియాలో ఇలా వీరంగం వేశాడు. అతడు పుచ్చుకున్న స్టిరాయిడ్ ఓవర్ డోస్ వల్ల అదుపుతప్పి ఇలా చేశాడని చెబుతున్నారు. కండల హీరోలా అతడు బలంగా ఉండడంతో ఆపాలని చూసినవారికి పనవ్వలేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మీద వలలు వేసి బంధించారు. ఒక తోడేలునో పులినో లాక్కెళుతున్నట్టు లాక్కెళ్లారు. ఆ వ్యవహారం అంతా వీడియోగా రికార్డయ్యి అంతర్జాలంలోకి రావడంతో అది కాస్తా జోరుగా వైరల్ అవుతోంది. సెలబ్రిటీ ప్రపంచంలో ఇవన్నీ మామూలే అనుకుంటే.. ఈ టైపులో రచ్చ మరీ దారుణం అనే చెప్పాలి.
అప్పట్లో హైదరాబాద్ తాజ్ బంజారాలో ఓ యంగ్ హీరో (పేరు ఉదయ్) ఇలానే వీరంగా వేశాడని అతడు అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసులో అతడు పోలీసులతోనూ ఘర్షణ పడడం అప్పట్లో సంచలనమైంది. సెలబ్రిటీలు డ్రగ్స్ పుచ్చుకోవడం వీరంగం వేయడం అనే కల్చర్ ముంబైలోనే కాదు ఇటు హైదరాబాద్ లోనూ అప్పుడప్పుడు బయటపడుతోందని ఆ ఘటన చెప్పింది.