లాక్ డౌన్‌లో అలా కుదిరింది.. గర్భవతి అయిన కరీనా

saif ali khan about Kareena Kapoor Got Pregnancy

కరోనా వైరస్, లాక్ డౌన్ వంటి వల్ల కొందరికీ మేలు జరుగుంది. ఇంకొందరికి కీడు జరిగింది. కరోనా వైరస్ విజృంభణ వల్ల లాక్ డౌన్ విధించడంతో జన జీవినం స్థంభించింది. తద్వారా వాతావరణంలో కాలుష్యం తగ్గింది. మిగతా ప్రాణ కోటికి ఎంతో ఉపశమనం కలిగింది. ఇక మ‌నుషుల‌ విషయానికొస్తే కొందరికి లాక్ డౌన్ బాగానే కలిసి వచ్చింది. నిత్యం షూటింగ్‌లంటూ క్షణ కాలం తీరిక లేకుండా తిరిగే సెలెబ్రిటీలకు ఎంతో సమయం దొరికింది.

saif ali khan about Kareena Kapoor Got Pregnancy
saif ali khan about Kareena Kapoor Got Pregnancy

సెలెబ్రిటీల జీవితాల్లో ఎప్పుడూ కూడా ఇంత సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించి ఉండరు. దాదాపు ఐదు నెలల పాటు ఇంటి పట్టునే ఉన్నారు. ఇక కొందరు హీరోయిన్లు వంటగదిలో దూరి గరిట తిప్పితే.. ఇంకొందరు తమకున్న ప్రతిభను మరింత మెరుగుపర్చుకున్నారు. ఇలా సెలెబ్రిటీలందరూ సంతోషంగానే గడిపారు. అందులో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ మరింత దగ్గరైనట్టున్నారు. బుల్లి తైమూర్ ఖాన్‌కు ఆడుకునేందుకు తమ్ముడినో, చెల్లినో ఇవ్వబోతోన్నారు.

కరీనా రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందన్న విషయాన్ని సైఫ్ అలీ ఖాన్ సంతోంగా ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. మా కుటుంబంలో మరో వ్యక్తి రాబోతోన్నాడనే విషయాన్ని ప్రకటించడం నాకెంతో సంతోషంగా ఉంది. మాకు సపోర్ట్ చేసి ప్రేమను పంచే శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు అంటూ సైఫ్ ఆనందంలో మునిగిపోయాడు. ఇక తైమూర్ ఇంత ఫేమస్ అయితే రాబోయే సంతానం ఇంకెంత హల్చల్ చేస్తుందో చూడాలి. గర్బం దాల్చిన కరీనా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.