కాకా కేక పెట్టించాడు:‘అర్జున్‌ రెడ్డి’ హిందీ టీజర్ ఇదిగో

హీరో విజయ్‌ దేవరకొండ కెరీర్ లో ‘అర్జున్‌ రెడ్డి’ఓ సంచలనం . ఈసినిమా ఎన్నో వివాదాల మధ్య విడుదలై భారీ వసూళ్లు సాధించింది. అంతేకాదు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈ సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్‌హీరో. అదే స్దాయిలో అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కూడా ఫుల్‌ ఫేమస్‌ అయ్యాడు. తెలుగులో సెన్సేషన్‌ సృష్టించిన ఈ చిత్రాన్ని.. మిగతా భాషల్లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Kabir Singh – Official Teaser | Shahid Kapoor, Kiara Advani | Sandeep Reddy Vanga | 21st June 2019

ముఖ్యంగా బాలీవుడ్‌లో అర్జున్‌ రెడ్డి రీమేక్‌పై భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది.రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్‌ 21న విడుదల చేయనున్నారు.

టీజర్ దాదాపు అర్జున్‌ రెడ్డి కు నకలు లాగే ఉంది. షాహిద్ లుక్స్‌తో పాటు సీన్స్‌, డైలాగ్స్‌ అన్ని అర్జున్‌ రెడ్డినే మక్కీకి మక్కి దించేసినట్టుగా అనిపిస్తుంది. మరి తెలుగు పరిశ్రమలో సంచలనం సృష్టించిన అర్జున్‌ రెడ్డి, బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.