‘నీ అంత రాస్కెల్‌ మరొకరుండరు..’ కు హీరో కౌంటర్ అదిరింది

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ చిత్రం తెలుగులో మంచి హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. పూరి మార్క్ స్టైల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కరెప్టెడ్ పోలీసు అధికారిగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రణ్‌వీర్‌సింగ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సారా అలీఖాన్ హరోయిన్ గా న‌టిస్తోంది.

ఈ సినిమాకి ‘సింబా’ అనే టైటిల్ ను ఖ‌రారు చేసి ట్రైలర్ రిలీజ్ చేసారు. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కున్న ఈ చిత్ర స‌గం షూటింగ్ హైద‌రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తెర‌కెక్కించారు.ఈ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి.

Simmba | Official Trailer | Ranveer Singh, Sara Ali Khan, Sonu Sood | Rohit Shetty | December 28

ఇందులో విలన్ పాత్రలో నటించిన సోనూ సూద్‌.. ‘నీ అంత రాస్కెల్‌ మరొకరుండరు’ అని రణ్‌వీర్‌ను తిడుతుంటే.. ‘తెలిసిన విషయాలెందుకు సర్‌.. తెలియంది ఏదన్నా ఉంటే చెప్పండి’ అని రణ్‌వీర్‌ ఫన్నీగా ఉంది.

అలాగే ‘టెంపర్‌’కు రీమేక్‌గా ‘సింబా’ రాబోతోందని గతంలో న్యూస్ వచ్చినప్పుడు ‘సినిమా మొత్తం రీమేక్‌ చేయడంలేదు. కేవలం ఫైటింగ్‌ సీన్సే ఇందులో వాడాం’ అని రోహిత్‌ శెట్టి తెలిపారు. కానీ ట్రైలర్ చూస్తే ‘టెంపర్‌’ సినిమాను దాదాపు ఎనభై శాతం మక్కీకి మక్కీ చేసినట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.