రణ్వీర్ దీపికను ఎలా పడేశాడో తెలుసా ?

అమ్మాయిలను ఇంప్రెస్స్ చేయడం చాలా కష్టం . అందులో సినిమా హీరోయిన్ ల విషయంలో మరీకష్టం . ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చాక హీరోయిన్ లు హీరోలతో పాటు ఎందరి నుంచో  ఇలాంటివి ఎదుర్కొంటారు . రాటు తేలిపోయి వుంటారు . అందుకే హీరోయిన్ లు హీరోలు చెప్పే మాటలకు త్వరగా సమ్మోహితులు కారు . రణ్వీర్ సింగ్ , దీపికా పదుకొనె  కలసి “రామ్ లీల ,” బాజీరావు మస్తానీ ” , “పద్మావతి”, సినిమాల్లో కలసి నటించారు . మూడు చిత్రాలు విభిన్నమైనవి  ,  ఈ చిత్రాలను చాలా గ్రాండ్ గా నిర్మించారు .ఘన  విజయ సాధించి రణ్వీర్ , దీపికా విజయ వంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు . అంతర్జాతీయంగా ఇద్దరి పేరు మారుమ్రోగి పోయింది . ఈ చిత్రాల షూటింగ్ సమయంలోనే వీరి ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి ఉండవచ్చు . ఎందుకంటే ఈ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు  వీరిని మరింత దగ్గర చేసి ఉండ వచ్చు .

అయితే ఇద్దరి మనస్సులో ప్రేమ భావన  ఉండ  వచ్చు . దానిని వ్యక్త పరిచినప్పుడే అది విఫలవంతం అవుతుంది . రణ్వీర్ , దీపిక వివాహం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి . వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి వివాహ తేదీలు ప్రకటించారు . నవంబర్ 14 ,15 తేదీల్లో రణ్వీర్ , దీపిక దంపతులు కాబోతున్నారు . ఈ సందర్భంగా రణ్వీర్ దీపికను ఎలా  పడేశాడో  చెప్పేశాడు . “గన్స్ ఎన్ రోజస్ ” సినిమాలోని  ” స్వీట్ గర్ల్ అఫ్ మైన్ ” అనే పాట  దీపికను చూసి పాడేవాడట . “ఈ పాట నా  భావాలకు సరిగ్గా సరిపోయింది . అందుకే ఈ పాటను దీపిక ముందు పదే పదే పాడి నా మనసులో వున్న  ఫీలింగ్స్ తెలిపాను ” అని చెప్పాడు రణ్వీర్ సింగ్ . ఏమైనా రణ్వీర్ పాట తో తన ప్రేమను పండించు కున్నాడు .