హాట్ షాట్: చిరిగిన జీన్స్ లో రకుల్

ఇప్పుడు ఎక్కడ చూసినా రకుల్ ప్రీతి సింగ్ కనపడుతోంది. మ్యాగజైన్ కవర్ మీదా, పేపరాజీ ఫోటోలతోనూ మీడియాని రకుల్ హాట్ హాట్ గా మార్చేస్తోంది. ముఖ్యంగా రకుల్ ఎప్పుడైతే బాలీవుడ్ చిత్రం మర్జావాన్‌ ఓకే చేసిందో ..అప్పుడే ఆమె గురించి వార్తలు, ఫొటోలు ఎక్కవయ్యాయి. బాలీవుడ్ మీడియా మొత్తం రకుల్ పై కాన్సర్టేట్ చేసింది. వారికి కోపరేట్ చేద్దామనుకుందో ఏమో ఇదిగో ఇలాంటి ఫొటోతో రకుల్ ప్రత్యక్ష్యమయ్యింది. ఈ ఫోటోలో అల్ట్రా హాట్ గా ఉండి అభిమానులకు పండగ చేస్తోంది.

ఇక రకుల​ ప్రీత్‌ సింగ్‌ కెరీర్ ప్రారంభంలోనే తెలుగులో వరుస అవకాశాలతో స్టార్‌ హీరోలతో నటించి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే మహేష్ తో చేసిన స్పైడర్ తర్వాత కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. అయితే ఆమె ఇప్పుడు కోలీవుడ్ ,బాలీవుడ్ లపై దృష్టి పెట్టింది. హిందీ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయిన రకుల్‌ రీసెంట్ గా అయ్యారితో మరోసారి ఆకట్టుకుంది.

తాజాగా మరో హిందీ మూవీకి రకుల్‌ సైన్‌ చేసింది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ముఖ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న మర్జావాన్‌ సినిమాతో రకుల్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రకుల్ తన అభిమానులకు తెలియచేసింది.

సిద్ధార్థ్ మల్హాత్రాతో రెండో సారి రకుల్ జత కట్టడంతో బాలీవుడ్ మీడియా రకరకాల రూమర్స్ అల్లేసే పనిలో పడింది. మొదట అయ్యారి సినిమాలోనూ కనిపించిన ఈ జంట..ఆ సినిమా వర్కవుట్ కాకపోవటంతో మళ్లీ కలిసి పనిచేయరనుకున్నారు.

కానీ అందరి అంచనాలను తారు మారుచేస్తూ.. మిలప్‌ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మర్జావాన్‌ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాను టీ సిరీస్‌తో కలిసి నిఖిల్‌ అద్వాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.

ఇక తెలుగులో ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’లో శ్రీదేవి పాత్రలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. తమిళంలో కార్తీ హీరోగా రూపొందుతోన్న ‘దేవ్‌’, సూర్య హీరోగా తెరకెక్కుతోన్న ‘ఎన్‌జికె’, శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తోన్న సినిమా.. ఇలా రకుల్‌ కెరీర్‌ కాస్త బిజీగానే వుంది‌