‘జెర్సీ’హిందీ రీమేక్, హీరోకే అంత ఇవ్వాలిట

‘జెర్సీ’హిందీ రీమేక్, హీరోకే అంత ఇవ్వాలిట

అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్ సూపర్ హిట్ కావటంతో తెలుగు రీమేక్ లకు మరింత క్రేజ్ ఏర్పడింది. రీసెంట్ గా నాని హిట్ చిత్రం జెర్శీ రైట్స్ ని కరుణ్ జోహార్ తీసుకుని రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రీమేక్ లో బాలీవుడ్‌ స్టార్ షాహిద్‌ కపూర్‌ను తీసుకోవాలని కరణ్‌ భావిస్తున్నారట. అయితే ‘కబీర్‌ సింగ్’ సక్సెస్ తో జోరు మీదున్న షాహిద్‌ ‘జెర్సీ’ రీమేక్‌లో నటించేందుకు రూ.40 కోట్లు డిమాండ్‌ చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… షాహిద్‌ ఈ రెమ్యునేషన్ కు అర్హుడేనని భావించిన కరణ్‌ కూడా ఆయన అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. దాంతో త్వరలో ఈ రీమేక్ ప్రారంభం అయ్యే అవకాసం కనపడుతోంది.

హిందీ వెర్షన్ కి సైతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని పోషించిన పాత్రలో బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తారట. అయితే ఈ రీమేక్ కి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావాల్సి ఉంది.

చిత్రం కథేమిటంటే..ప్రేమించి పెళ్లి చేసుకున్న నాని (అర్జున్) కు వైవాహిక జీవితం అంత గొప్పగా ఉండదు. తన కెంతో ఇష్టమైన క్రికెటర్ గా ఎదగాలన్న కోరిక ని వదిలేసుకుంటాడు. తన భార్య సంపాదనపై బ్రతకుతూంటాడు. వాళ్లకో కొడుకు నాని…అతనితోనే అర్జున్ జీవితం. అయితే ఓ రోజు కొన్ని పరిస్దితుల్లో తను కోల్పోయిన గౌరవాన్ని, తన కొడుకు ఆనందాన్ని తన క్రికెట్ ఆటలో చూసుకోవాలనుకుంటాడు. దాంతో లేటు వ‌య‌సు క్రికెటర్ గా ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తాడు. ఆ క్ర‌మంలో అర్జున్ ఎదుర్కొన్న సమస్యలేంటి? అత‌డు భార‌త జ‌ట్టుకు ఎంపిక కావాలని చేసే ప్ర‌య‌త్నం ఫలించిదా లేదా? అన్న‌దే సినిమా.

ఇదిలా ఉంటే… విజయ్‌ దేవరకొండ నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాను రీమేక్‌ చేస్తానని కరణ్‌ జోహార్‌ ప్రకటించారు. ఇప్పుడు ‘జెర్సీ’, ‘ఓ బేబీ’ సినిమాల రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.