నాగ్ భారీ సినిమా ఓటిటిలో రిలీజ్??దీనిపై క్లారిటీ ఏమిటంటే.!

అక్కినేని వారి సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున మరియు ఇతర హీరోలు తమ సాలిడ్ కం బ్యాక్ ని ఒకరి తర్వాత ఒకరు ఇస్తూ వస్తున్నారు. దీనితో మళ్ళీ అక్కినేని కుటుంబం ఇండస్ట్రీలో పుంజుకోగా అక్కినేని నాగార్జున ఇప్పుడు మరిన్ని ఆసక్తికర సినిమాల్తో సిద్ధం అవుతున్నాడు. 

అయితే అలా నాగ్ చేపట్టిన భారీ చిత్రమే “ది ఘోస్ట్”. ఫై ఎస్ వి గరుడావేగా లాంటి సాలిడ్ సినిమా తీసి హిట్ అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తరుతో నాగ్ చేస్తున్న ఫస్ట్ సినిమా అందులోని భారీ బడ్జెట్ సినిమా కూడా ఇదే. 

అయితే ఈ సినిమాని చాల బాగా ప్లాన్ చేస్తుండగా దీనిపై అయితే గత కొన్ని రోజులు నుంచి పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి లో రిలేస్ అవుతుంది అని అంటున్నారు. కానీ లేటెస్ట్ గా అయితే మేకర్స్ దీనిపై గట్టి క్లారిటీ ఇచ్చారు. 

ఈ సినిమా కేవలం థియేటర్స్ లోనే ముందు రిలీజ్ అవుతుంది అని అందులో సందేహం లేదని తెలియజేసారు. అలాగే ఈ జూలై 9న నాగ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కూడా రిలీజ్ అవుతుంది అని తెలిపారు. మొత్తానికి అయితే ఈ సినిమా మాత్రం ముందు థియేటర్స్ లోనే వస్తుందని చెప్పాలి.