‘మోదీ బయోపిక్‌’ లో అమిత్‌ షా లుక్‌…ఇదే !

ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌  తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒమంగ్ కుమార్ బీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కాగా రీసెంట్ గా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమాలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. అమిత్ షా పాత్రలో మనోజ్ ‌జోషి నటిస్తున్నారు. అమిత్‌ షా పాత్రలో మనోజ్ జోషి ఒదిగిపోయారు. తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోస్టర్‌పై ‘దేశ భక్తే నా శక్తి’ అన్న క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి ప్రముఖ రచయిత సంజయ బారు రచించిన పుస్తకం ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే బయోపిక్ ని రూపొందించి విడుదల చేసారు.