సూపర్ క్రేజీ గా “లైగర్” నుంచి ‘వాట్ లగా దేంగే’ మిక్స్ బీట్.!

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా పాన్ ఇండియా చిత్రాల్లో బిగ్ స్టార్స్ సినిమాలు కొన్ని ఉన్నాయి కానీ చిన్న హీరోల్లో మాత్రం మరో రెండు సినిమాలు భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నాయని చెప్పాలి. మరి ఆ చిత్రాల్లో అఖిల్ నటిస్తున్న “ఏజెంట్”  ఒకటి.

కాగా మరొకటి సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “లైగర్” కూడా ఒకటి. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ అదిరే అప్డేట్ లు మరియు ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ని ఆల్రెడీ స్టార్ట్ చెయ్యగా ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం అంతా పూరి జగన్నాద్ వింటేజ్ మార్క్ లో ఎక్కడా తగ్గకుండా సాలిడ్ ఎలిమెంట్స్ తో ఉన్నట్టు మళ్ళీ ప్రూవ్ అయ్యింది అని చెప్పాలి చిత్ర యూనిట్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన సాంగ్ ‘వాట్ లగా దేంగే’ ఆరేంజ్ లోనే ఉందని చెప్పాలి. పూరి జగన్నాద్ కి బాగా తెలిసిన మాస్ పల్స్ అలాగే మ్యూజిక్ లో తన అభిరుచి ఈ సాంగ్ లో బాగా వినిపిస్తుంది.

ఇక ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితో అయితే ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాలో బాలీవుడ్ లో హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా రమ్య కృష్ణ, హాలీవుడ్ స్టార్ మైక్ టైసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.