10 నిముషాల్లో క్రిష్ బుడగ పేలిపోతుందంటూ సవాల్

తన అక్కకు సపోర్ట్ గా కంగనా రనౌత్ సోదరి రంగోలి రంగంలోకి దిగింది. ఆమె క్రిష్ ని ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ఆమె క్రిష్ ఇంటర్వూలలో చెప్పే మాటలకు సెటైర్ వేసింది. నేను బంగారంలాంటి సినిమాని తీసి ఇస్తే …దాన్ని కంగన వెండిగా మార్చింద‌ని క్రిష్ అన్న మాటలకు అవి గుచ్చుకుంటున్నాయి.ముఖ్యంగా సినిమాలో ఇప్ప‌టికి 70 శాతం త‌న‌దే అని అంటున్న క్రిష్‌కి కంగ‌న సిస్ట‌ర్ రంగోలి ఘాటుగా స‌మాధానం ఇచ్చింది.

రంగోలి ట్వీట్ చేస్తూ… స‌రే …సినిమా అంతా నువ్వే తీశార‌ని ఒప్పుకుంటున్నాం. ఇక శాంతించు. కంగ‌న వ‌ల్లే సినిమా ఆడుతుంద‌నేది వాస్త‌వం క‌దా. ఆమెని అలా వ‌దిలెయ్యి. ఆమె స‌క్సెస్‌ని ఎంజాయ్ చేయ‌నివ్వు. ఇక నీ ప‌ని నువ్వు చూసుకో, అంటూ ట్వీట్ చేసింది రంగోలి. ఇన్‌డైర‌క్ట్‌గా భారీ సెటైర్ వేసింది.

మొదట ‘మణికర్ణిక’ క్రెడిట్ మొత్తం క్రిష్‌నే తీసుకోమనండి అంటూ ట్వీట్ చేసిన రంగోళి.. తరవాత తన చెల్లెలే 70 శాతం సినిమాను తెరకెక్కించింది అని మరో ట్వీట్ చేశారు. ఒక వేళ తన చెల్లెలు 70 శాతం సినిమాను తెరకెక్కించలేదని క్రిష్ నిరూపిస్తే క్షమాపణలు చెబుతుంది అంటూ పేర్కొన్నారు. 

‘నేను కంగనాతో మాట్లాడాను. కంగనా 70 శాతం సినిమా (డ్రామా, యాక్షన్)ను తెరకెక్కించిందని అమె తరఫున నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను. మొదట డీఓపీ కిరణ్ డియోహన్స్, తరవాత డీఓపీ సచిన్ కె క్రిష్ణతో కలిసి కంగనా షూట్ చేసింది. ఎడిటర్ రామేశ్వర్‌తో కలిసి సినిమాను 100 శాతం పూర్తిచేసింది. క్రిష్‌ను రామేశ్వర్ తన జీవితంలో ఒక్కసారి కూడా కలవలేదు’ అని రంగోళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అసలు ప్రస్తుత పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌కు క్రిష్ ఎవరో కూడా తెలీదని మరో ట్వీట్‌లో రంగోళి వ్యాఖ్యానించారు. పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ మొత్తాన్ని కంగనానే ఎంపిక చేసిందని చెప్పారు. ఒంటి చేత్తో సినిమా తొలికాపీని కంగనా తన నిర్మాతకు అందించిందని గుర్తుచేశారు. ఇదంతా నిజం కాదని, తొలికాపీ నిర్మాతకు నచ్చలేదని క్రిష్ నిరూపిస్తే కంగనా ఆయనకి క్షమాపణలు చెబుతుందని, చిత్రంలో తన పేరును తొలగిస్తుందని సవాల్ విసిరారు.

క్లాప్ బోర్డుల దగ్గర నుంచి టెక్నీషియన్ల వరకు ప్రతిదానికి రికార్డ్ ఉందని, దీనిపై క్రిష్ కంగారు పడాల్సిన అవసరం లేదని రంగోళి ఎద్దేవా చేశారు. క్రిష్ బుడగ పేలిపోవడానికి 10 నిమిషాల సమయం చాలంటూ హెచ్చరించారు. చిత్రీకరణ తరవాత 2500 వీఎఫ్ఎక్స్ షాట్లు, బీజీఎం విషయంలో కంగనా సవాళ్లు ఎదుర్కొందని, వాటిని సూపర్ హ్యూమన్ స్పీడుతో రెండు నెలల్లో పూర్తిచేసిందని రంగోళి ప్రశంసించారు. క్రిష్ ప్రమేయం లేకుండా ఇవన్నీ కంగనా చేసిందని స్పష్టం చేశారు. 

రంగోలికు ఇంత కోపం రావటానికి కారణం… రీసెంట్ గా బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మణికర్ణిక’ సినిమాకు సంబంధించిన పలు విషయాలు పేర్కొన్నారు క్రిష్‌. ‘‘మణికర్ణిక’ సినిమాను జూన్‌లోనే పూర్తి చేశాను. అన్ని పాత్రలు డబ్బింగ్‌ కూడా చెప్పేసుకున్నారు. అప్పుడు ‘మెంటల్‌ హై క్యా’ షూటింగ్‌ నిమిత్తం లండన్‌లో ఉన్నారు కంగనా. ఇండియా వచ్చిన తర్వాత నేను చిత్రీకరించిన విధానం నచ్చలేదని నిర్మాణ సంస్థను నమ్మించారు.

భోజ్‌పూరి సినిమాలా ఉందని వాళ్లతో పేర్కొన్నారు. సినిమా మొత్తం తన చుట్టూనే తిరగాలన్నట్టు కంగనా ప్రవర్తన ఉండేది. సోనూసూద్‌ పాత్ర సుమారు 100 నిమిషాలు ఉండేది. దాన్ని 60 నిమిషాలకు కుదించేయడంతో ఆయన తప్పుకున్నారు తప్పితే లేడీ డైరెక్టర్‌తో యాక్ట్‌ చేయను అనే కారణం కాదు. ఫస్ట్‌ హాఫ్‌లో ఓ 25 శాతం సెకండ్‌ హాఫ్‌లో 15 శాతం మాత్రమే కంగనా రనౌత్‌ డైరెక్ట్‌ చేశారు’’ అంటూ తెర వెనుక జరిగిన విషయాన్ని పంచుకున్నారు.