బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారింది. కన్యత్వమనేది నిధి కాదని కొచ్లిన్ తెలిపింది. పెళ్లి అయ్యేంతవరకు కన్యగా వుండి.. భర్తకు మాత్రమే అంకితం చేయడానికి వర్జినిటీ అనేది నిధి కాదని కల్కి చేసిన బోల్డ్ కామెంట్స్ అంతటా హాట్ టాపిక్స్ గా మారాయి. అలాగే పెళ్లయ్యే వరకు సెక్స్‌కి దూరంగా వుండాలని అనడం ఏమిటని ప్రశ్నించింది. అది పూర్తిగా వారి పర్శనల్ విషయమని కల్కి చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను వివాహం చేసుకున్న కల్కి కొంత కాలానికి తర్వాత అతడి నుంచి విడాకులు పొందింది. మీటూ ఉద్యమంలో భాగంగా సెక్స్ ప్రస్తావన సాగడంతో.. ఆడవాళ్లకు సెక్స్ విషయంలో నో అనేందుకు ఎంత హక్కు వుంటుందో.. అంతే హక్కు.. ఎస్ అని చెప్పే విషయంలోనూ వుంటుందని కల్కి తెలిపింది. ప్రస్తుతం కల్కి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం మీటూ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో శృంగారం ప్రస్తావన రావడంతో.. ఆడవాళ్లకు శృంగారం విషయంలో నో అనే హక్కు ఎంత ఉంటుందో.. ‘ఎస్’ అని చెప్పే హక్కు కూడా అంతే ఉంటుందని చెప్పింది. పెళ్లయ్యేంత వరకు శృంగరానికి దూరంగా ఉండాలని చెప్పడం ఏమిటని కల్కి ప్రశ్నిస్తోంది. అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని చెబుతోంది.