టాక్సీవాలా చిత్రం హిట్ తో మంచి ఊపు మీద ఉన్న హీరో విజయ్ దేవరకొండపై జాహ్నవి కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కుమార్తె జాన్వీ కపూర్ ఓ పాపులర్ టీవీ షోలో పాల్గొంది. ఈ షోలో ఆమెకు “ఒకవేళ నువ్వో రోజు ఓ మేల్ యాక్టర్‌గా నిద్ర లేస్తే… ఎవరిలా మేల్కోవాలని అనుకుంటావ్? ఎందుకు?” అనే ప్రశ్న ఎదురైంది.
దానికి సమాధానంగా “విజయ్ దేవరకొండలా మారాలనుకుంటున్నానని, మంచి టాలెంట్ ఉన్న నటుడు అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. అంతేకాదు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ఉందని చెప్పింది. ఈ విషయం తెలిసిన విజయ్ దేవరకొండ ఆశ్చర్యపోయారట. తన గురించి, తన సినిమాల గురించి బాలీవుడ్ లో ఓ యంగ్ హీరోయిన్ ఫాలో అయ్యి..తనను అభిమానించటం అనేది ఊహించలేదని తన సన్నిహితుల వద్ద అభిప్రాయ పడ్డారట.
ఆమె మాటలు వింటుంటే విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లోనూ ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేస్తోంది. చాలారోజుల నుంచి విజయ్ దేవరకొండతో జాన్వీ ఓ సినిమా చేస్తుందనే వార్తలు విన్పించాయి. కానీ అవి రూమర్స్ అయ్యాయి. మరి ఇప్పటికైనా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాసం ఉందేమో చూడాలి.