బెంగళూరులో దీపికావీర్ ల  రిసెప్షన్

దీపికా పదుకొనె , రణ్వీర్ ల వివాహం  గురించి రోజుకో కొత్త వార్త వినవస్తుంది. ఈ స్టార్ కపుల్  ఈ వివాహం కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ఇరు కుటుంబాలవారు  ఒప్పుకోవడంతో ఇద్దరు ఎంతో ఆనందంగా  వున్నారు. దీపిక ఈ  సినిమా షూటింగ్లో లేదు. వివాహము  కోసమే ఖాళీగా వుంది. రణ్వీర్ తన షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాడు.

దీపికా పెళ్లి పనుల హడావిడిగా వుంది . నవంబర్ 14 , 15 రెండు రోజులపాటు వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెళ్లి అనే మాట మనసులోకి రాగానే మధురమైన భావన కలుగుతుంది అని ఈ రోజు దీపికా మీడియాకి చెప్పింది.

వివాహ అనంతరం నవంబర్  21న బెంగళూరులో వివాహ విందు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. దీపికా తండ్రి ప్రకాష్ పదుకునే  బాడ్మింటన్  ఆటగాడు. వీరిది మంగళూరు. అందుకే దీపికా స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఈ విందును ఏర్పాటు చేస్తున్నట్టు దీపిక చెప్పింది. డిసెంబర్ 1 న ముంబైలో గ్రాండుగా   రిసెప్షన్  ఏర్పాటు చేస్తున్నారు.