హిందీ స్టార్ కపుల్ దీపికా పదుకొనె , రణ్వీర్ సింగ్ ల వివాహం ఇరు సంప్రదాయాల ప్రకారం ఇటలీలోని లేక్ కొమో లో వైభవంగా జరిగింది . 14వ తేదీన దీపికా కుటుంబ సంప్రదాయం ప్రకారం కొంకిణీ పద్దతిలో జరిగింది . దక్షిణ భారత వివాహ వేడుకలా దీపికా తల్లితండ్రులు , కుటుంబ స్నేహితుల మధ్య కన్నుల పండుగగా జరిగింది . 15వ తేదీన రణ్వీర్ సింగ్ కుటుంబ సంప్రదాయం ప్రకారం సింధీ పద్దతిలో జరిగింది . సింధీ ది ఓ విభిన్నమైన పద్దతి . సర్దార్జీల్లో సింధీలు వేరుగా వుంటారు . అందుకే రణ్వీర్ సింగ్ కుటుంబ సభ్యులు తమ సంప్రదాయం ప్రకారం వివాహాన్ని
గ్రాండ్ గా జరిపించారు .
ఈ రెండు రోజుల వేడుకలు అతి ముఖ్యులైన వారి మధ జారిగాయి . వివాహ వేడుకలు తరువాత కొత్త దంపతులు ఇద్దరు ఈ నెల 21 న బెంగళూరులో వివాహ విందు ఏర్పాటు చేశారు .