దీపిక, రణ్వీర్ వివాహం డేట్ ఫిక్స్

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న  దీపికా పదుకొనె  , రణ్వీర్ సింగ్ ల వివాహం నవంబర్ 14, 15 తేదీల్లో జరుగుతుందని ప్రకటించారు . తెర మీద అద్భుతంగా నటించే ఈ జంట తెర వెనుక కూడా ప్రేమాయణం సాగిస్తున్నారని మీడియాలో కథనాలు వస్త్తునే వున్నాయ్. ఎప్పుడో జరగాల్చిన ఈ వివాహం వాయిదా పడుతూ వస్తున్నది . ఎందుకు అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది . మా వివాహానికి ఇరువైపు కుటుంబాలవారు అంగీకరించారని చెప్పడాన్ని ఆనందిస్తున్నామని దీపిక, రణ్వీర్ తెలిపారు

 

వీరిద్దరూ కలసి “రామ్ లీల”, “బాజీరావు మస్తానీ” ,” పద్మావతి” చిత్రాల్లో కలసి నటించారు . అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ మొదలై అది డేటింగ్ వరకూ వెళ్ళింది . వివాహానికి సంబంధించి హిందీ, ఇంగ్లీషు భాషల్లో  ఓ లేఖను మీడియాకు విడుదలచేశారు. వివాహ వార్తను తెలియ జేయడానికి చాలా సంతోషిస్తున్నాము మీరు చూపించిన ,ప్రేమ, అభిమానమే ఇక ముందు కూడా మా మీద వుండాలని మనసారా కోరుకుంటున్నాము అని తెలిపారు.