వెంకి,నాగ్ పోటీ…ఎవరికి దక్కుతుందో

అజయ్ దేవగన్ తో కలిసి ‘దే దే ప్యార్‌ దే’ అనే సినిమా చేసింది రకుల్ ప్రీతి సింగ్. క్రిందటి నెలలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుందన్నారు, చాలామంది బాగాలేదన్నారు. కానీ రెండో రోజు నుంచి టాక్ మారింది. సినిమా బాగుందంటున్నారు. వీకెండ్ గడిచేసరికి కంప్లీట్ పాజిటివ్ టాక్ తో సినిమా హిట్ రేంజ్ కు వెళ్లిపోయింది. అలా బాలీవుడ్ లో తొలి విజయం అందుకుంది రకుల్. అజయ్ దేవగన్ సైతం హ్యాపీ ఫీలయ్యారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేయాలని ప్లానింగ్ జరుగుతోందని వినికిడి.

ఓ పెద్ద నిర్మాణ సంస్ద ఆ చిత్రం రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తోందిట. అజయ్ దేవగన్ చేసిన పాత్రకు గానూ వెంకటేష్ కానీ, నాగార్జునని కానీ తీసుకునే అవకాసం ఉందని సమాచారం. మొదట ప్రయారిటీ వెంకటేష్ కే అంటున్నారు. ఇంట్లో ఇల్లాలు వంటిల్లో ప్రియురాలు వంటి సినిమాలు చేసిన అనుభవంతో వెంకీ దుమ్ము దులిపేస్తాండున్నారు. మ్యారేజ్‌ అండ్‌ మోడ్రన్‌ డేస్‌ రిలేషన్‌షిప్స్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది. ‘దే దే ప్యార్‌ దే’ అనే టైటిల్‌ అర్దం ఏమిటంటే.. అంటే.. ఇవ్వు.. ఇవ్వు.. ప్రేమ ఇవ్వు అని అర్థం.

కథేంటంటే…

యాభై సంవత్సరాల ఆశీష్ మెహ్రా (అజయ్ దేవగన్) లండన్‌లో ఓ వ్యాపారవేత్త. వైవాహిక జీవితంలో విభేదాల కారణంగా భార్య మంజు (టుబు) నుంచి విడాకులు తీసుకోకుండా దూరమవుతాడు. ఆ తర్వాత ఓ పెళ్లిలో పరిచయమైన 25 ఏళ్ల ఆయేషా (రకుల్ ప్రీత్ సింగ్)తో ప్రేమలో పడుతాడు. ఆశీష్, ఆయేషా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఈ క్రమంలో ఆయేషాను తన భార్య మంజుకు, కుటుంబ సభ్యులకు కలిపించేందుకు లండన్ నుంచి మనాలీకి వెళ్తారు. ఆశీష్ కూతురు పెళ్లిచూపుల కార్యక్రమంలో జరిగిన గొడవ కథను మలుపుతిప్పుతుంది? దాంతో ఆయేషా లండన్‌కు వెళ్లిపోతుంది? మనాలీలో మంజు, ఆయేషా, ఆశీష్ మధ్య చోటుచేసుకొనే విషయాలు ఫన్నీగా ఉంటాయి.