మహేష్ బాబు, కియారా అద్వానీ జంటగా నటించిన భరత్ అనే నేను తెలుగు చిత్రం హిందీలో డబ్బింగ్ అయ్యింది . ఈ సినిమాను హిందీలో “డాషింగ్ సీ.ఎం భరత్ ” పేరుతో విడుదల చేస్తున్నారు . డి వి వి దానయ్య ,కొరటాల దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు . హిందీ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మంగళవారం నాడు దీనికి యు / ఏ సర్టిఫికెటును ఇచ్చారు .
హిందీ రైట్స్ తీసుకున్న వ్యక్తి ఈ సినిమాలో ని పాటలను హిందీలోకి మార్చలేదు . తెలుగు పాటలకు ఏ సంగీతం అయితే ఉంటుందో అది వుంది తెలుగు పాటల స్థానంలో హిందీ గీతాలను రాయిస్తారు . అయితే సమయం లేనందువల్ల గీతాలను వ్రాయించలేక పోయానని చెప్పాడు . త్వరలో వ్రాయించి తీసుకు వస్తానని అతను చెప్పాడు . తీసుకు వచ్చిన తరువాత చూద్దాం , ఇప్పుడైతే పాటలు లేకుండా కేవలం సంగీతాన్ని అనుమతించమని సెన్సార్ అధికారి చెప్పాడు .
అయితే భరత్ అనే నేను సినిమా హిందీ డబ్బింగ్ మాత్రం బాగా చేశారు . దీనిని నార్త్ లో విడుదల చేసే ఉద్దేశ్యంతో ఉన్నామని హిందీ చిత్ర నిర్వాహకుడు తెలిపాడు