ఫైనల్ గా “బ్రహ్మాస్త్ర” ఇలాంటి ఫెయిల్యూర్ సినిమాగా నిలిచిపోనుందా.?

ఒకప్పుడు ఇండియన్ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే.. క్రేజీ కథలతో ఎన్నో భారీ హిట్స్ ఇచ్చిన బాలీవుడ్ సినిమాకి ఇప్పుడు అసలు తీరని కష్టమే వచ్చింది. ఇప్పుడు వస్తున్న ఏ ఒక్క సినిమా కూడా అంచనాలకి తగ్గట్టు గా రాణించడం లేదు.

దీనితో ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ వచ్చింది లేటెస్ట్ సినిమా “బ్రహ్మాస్త్ర”. ఎప్పుడో 2018 లో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా నాలుగేళ్ల తర్వాత రిలీజ్ అయ్యింది. అయితే అప్పట్లో ఒక బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సహా ఇండియన్ సినిమా దగ్గర భారీ బడ్జెట్ సినిమాగా అనౌన్స్ చెయ్యగా..

ఆ రేంజ్ లోనే ఫైనల్ గా రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ సినిమాలో మేకర్స్ చెప్పినట్టే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ కూడా కనిపించాయి. కానీ అనుకోని విధంగా సినిమా ఎక్కడో తేడా కొట్టడంతో మొదటి వీకెండ్ తర్వాత భారీ స్థాయిలో వసూళ్లు పడిపోయాయి, దీనితో ఈ సినిమాకి జరిగిన బిజినెస్ అలాగే సినిమాకి పెట్టిన బడ్జెట్ లెక్కల పరంగా అయితే ఎలా లేదన్నా ఒక కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాగా ఇది నిలిచిపోతుంది అని అంటున్నారు.

పెట్టిన బడ్జెట్ జరిగిన బిజినెస్ మరియు వసూళ్లు చూస్తే తప్పకుండా అంత మొత్తంలో లాభాలు అయితే వచ్చేలా ఉన్నట్టు ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్, ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా నటించగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. అలాగే నాగార్జున షారుఖ్, అమితాబ్ లాంటి స్టార్స్ నటించారు.