#RRR కు బాలీవుడ్ టచ్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి

ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మల్టిస్టారర్ #RRR. ఈ సినిమా ప్రారంభ వేడుక తేదీని ఖరారు చేస్తూ రీసెంట్ గా ప్రకటన కూడా వచ్చేసింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రానికి ప్రత్యేక తేదీని ఎంపిక చేసుకోవటం అంతా చర్చనీయాశంగా మారింది.

ఇదే సమయంలో ఈ చిత్రాన్ని బాహుబలి తరహాలోనే ఎన్ని భాషల్లోకి సిద్దం చేస్తారనే టాపిక్ సైతం మొదలైంది. ఎలాగో తమిళ,మళయాళ మార్కెట్లు ఈ సినిమా కోసం సిద్దంగా ఉంటాయి. రీసెంట్ గా బాహుబలితో బాలీవుడ్ సైతం రాజమౌళి కొత్త సినిమాలపై దృష్టి పెట్టింది. దాంతో అక్కడ కూడా హిందీ వెర్షన్ రెడీ చేసి రిలీజ్ చేస్తారు. ఇక ఇంటర్నేషనల్ వెర్షన్ ఎలాగో ఉంటుంది.

ఇన్ని లాంగ్వేజ్ లు అనుకున్నప్పుడు ఆర్టిస్ట్ లను కూడా నేటివిటీ కోసం ఆ భాషలకు సంభందించిన వారిని తేవటం పరిపాటి. అదే కోవలో ఇప్పుడు హిందీ నుంచి స్టార్ హీరోయిన్స్ ఈ సినిమా కోసం తెస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే వాళ్లు ప్రియాంకచోప్రానా ,దీపిక పదుకోనినా, అలియాభటా,కత్రినా కైఫా, హాలీవుడ్ హీరోయినా..ఎవరిని సెలక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఖచ్చితంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని సినిమాలోకి తెస్తున్నారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ లోనూ ఓ రేంజిలో బిజినెస్ చేయాలి కదా.