ముఖ్యమంత్రి కార్యాలయం పార్లమెంటా?

ఏ ముఖ్య మంత్రి కార్యాలయమైనా  ఆ రాష్ట్ర  సచివాలయం లో ఉంటుంది .  ఇక అసెంబ్లీ  జరిగేటప్పుడు ముఖ్య మంత్రి అక్కడికి వెడతాడు . కానీ ఓ ముఖ్యమంత్రి రోజు పార్లమెంటుకు వెడతాడట . ఈ సన్నివేశం “డాషింగ్ సీఎం  భరత్ ” అనే హిందీ సినిమాలో వుంది . తెలుగు సినిమా “భరత్ అనే నేను” చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేశారు . అంతవరకు బాగానే వుంది . భరత్ పాత్ర దారి మహేష్   తన గర్ల్ ఫ్రెండ్  వసుధ  పాత్రధారి కియారా అద్వానీని కాఫీ కి ఆహ్వానిస్తాడు . వసుధ తన స్నేహితులతో స్టార్ హోటలేకు వస్తుంది . ఆ సందర్భంలో వసుధను భరత్  తనని ఎక్కడ చూశాడనే అనుమానం వస్తుంది .

అక్కడ వున్నముఖ్యమంత్రి భరత్ పర్సనల్ అసిస్టెంట్  బ్రహ్మాజీ ” రోజు పార్లమెంటుకు వెళ్ళేటప్పుడు సర్ మిమ్మల్ని చూస్తాడు  ” అంటాడు . హిందీ సినిమాలో ఈ రకమైన తప్పు రావడం సినిమావారికి రాజకీయ పరిజ్ఞానం  ఎంత ఉందొ దేశం అంతా తెలుసుకుంటుంది . ఈ రకమైన తప్పును ఎవరు సమర్ధించరు , క్షమించరు .