Gallery

Home Bollywood ప్లాఫ్ టాక్..కలెక్షన్స్ టాప్

ప్లాఫ్ టాక్..కలెక్షన్స్ టాప్

రంజాన్‌ పర్వదినం సందర్భంగా విడుదలైన సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘భారత్‌’. ఈ సినిమాపై భిన్నమైన సమీక్షలు వెలువుడ్డాయి. సల్మాన్‌ అభిమానులను అలరించే సినిమా అని కొందరు అంటుండగా.. సినిమా బోరింగ్‌గా ఉందని, కొంచెం స్కిప్ట్‌ మీద దృష్టి పెట్టి ఉంటే.. మరింత బాగుండేదని చాలా మంది అన్నారు. ఇలా టాక్ తేడాగా ఉన్నా సినిమా భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది.

దాంతో బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ మరోసారి నిరూపితం అయ్యింది. సల్మాన్‌ఖాన్‌కు రంజాన్‌ సెంటిమెంట్‌ మరోసారి వర్క్‌వుటయింది. భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఉన్నప్పటికీ సల్మాన్‌ చిత్రానికి వసూళ్ల వర్షం కురవడం విశేషం గా ఆయన అభిమానులు చెప్తున్నారు.

ఎంతలా అంటే.. సల్మాన్‌ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ‘భారత్‌’ రికార్డు సాధించింది. అంతేకాదు రంజాన్‌ రోజున విడుదలైన సల్మాన్‌ సినిమాల్లో టాప్‌ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బుధవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజే రూ.42.30 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

2016లో రంజాన్‌ రోజున విడుదలైన సుల్తాన్‌ సినిమా ఒక్కరోజు కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. సుల్తాన్‌ సినిమా తొలిరోజు రూ. 36.54 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన టూబ్‌లైట్‌, రేస్‌ 3 సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ఒక్క 2013లో మినహా 2010 నుంచి ఇప్పటివరకు ప్రతి రంజాన్‌కు సల్మాన్‌ఖాన్‌ విడుదలయ్యాయి. ‘భారత్‌’ కు అత్యధిక ఓపెనింగ్‌ వసూళ్లు అందించినందుకు అభిమానులకు ట్విటర్‌ ద్వారా సల్మాన్‌ఖాన్‌ ధన్యవాదాలు తెలిపాడు.

- Advertisement -

Related Posts

బాలీవుడ్ నటిని ఒక రాత్రి తనతో ఉండమని కోరిన దక్షిణాది నిర్మాత !

బాలీవుడ్ సీనియర్ నటి 'నీనా గుప్తా' ఇటీవల విడుదల చేసిన తన ఆత్మకథలో చిత్ర పరిశ్రమలో తాను అనుభవించిన అనేక అవాంఛనీయ సంఘటనల గురించి రాశారు. అందులో ఒక సినీ నిర్మాత ఆమెతో...

సినిమాలు వదిలేసి సన్యాసం తీసుకున్న హీరో, హీరోయిన్లు

సినిమాల్లో రాణించిన వారి నెక్స్ట్ టార్గెట్ ఎక్కువగా రాజకీయాల్లోకే ఉంటుంది. మరికొందరు వ్యాపార వ్యవహారాలు చూసుకుంటారు. కానీ.. సినిమాల్లో సక్సెస్ అయ్యాక కొందరు సన్యాసంలోకి వెళ్లిన నటీనటులు కూడా ఉన్నారు. వారికి సినిమాలతో...

ట్విట్టర్లో కరీనా కపూర్ పై బాయ్ కాట్ ట్రెండ్..! ఆ సినిమానే కారణం..

కరీనా కపూర్ బాలీవుడ్ లో పెద్ద కుటుంబం నుంచి వచ్చి టాప్ హీరోయిన్ అయింది. హీరో సైఫ్ ఆలీఖాన్ ను పెళ్లాడి.. ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు....

Latest News