Aryan Khan: అసలు విషయం తెలియకుండా షారుఖ్ ఖాన్ కొడుకుని ఆటడేసుకున్న నెటిజన్లు..

Aryan Khan: రెండు రోజుల నుండి సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే… ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగా బహిరంగంగా మూత్రవిసర్జన చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అంటూ అసత్య ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే డ్రగ్స్‌ కేసులో అరెస్టయి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఇలాంటి గలీజ్‌ పని చేసి పోలీసుల చేత చీవాట్లు తిన్నాడంటూ పలువురు నెటిజన్లు సదరు వీడియోను షేర్లు చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఆర్యన్ ఖాన్ ని దుమ్మెత్తి పోస్తున్నారు.

కానీ, వాస్తవానికి ఆ వీడియో నిజమే కానీ అందులో ఉన్న వ్యక్తి మాత్రం ఆర్యన్‌ ఖాన్‌ కాదు. అతడు కెనడియన్‌ నటుడు బ్రోన్సన్‌ పెలెటియర్‌. 2012లో లాస్‌ ఎంజిల్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో అందరిముందే పని కానిచ్చేయడంతో అధికారులు అతడిని అరెస్ట్‌ కూడా చేశారు. ఈ సంఘటన జరిగి దగ్గర దగ్గరగా దశాబ్దకాలం అవుతోంది. అయితే ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

YouTube video player