మలైకా అరోరా వయసు 45. అర్జున్ కపూర్ వయసు 33. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్యా రిలేషన్ నడుస్తోంది. అది అందరికీ బహిరంగ రహస్యమే. మలైకా 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అతని వల్ల ఆమెకు 15 ఏళ్ల అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. 2017లో ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. రెండేళ్ల నుంచే మలైకా ,అర్బాజ్ విడిగా ఉంటున్నా గత ఏడాదే చట్టబద్ధంగా విడాకులు పొందారు. అసలు ఈ అర్జున్ కపూర్ మూలంగానే డైవర్స్ దాకా వెళ్లిందనే వాళ్లూ ఉన్నారు.
ఇక 2019లో ఈ జంట వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. మీడియావాళ్లు వారి ఎఫైర్ గురించి ప్రశ్నించగా.. అర్జున్, మలైకా సరైన రిప్లై ఇవ్వలేదు. కానీ అర్జున్, మలైకా పార్టీలకు, డేట్‌కు వెళుతూనే ఉన్నారు. రీసెంట్ గా విదేశాలకు టూర్ కూడా వెళ్లారు. చాలాసార్లు ఎయిర్ పోర్ట్ లలో జంటగా కనిపించారు.
అయితే మలైకాతో వివాహం గురించి అర్జున్ తాజాగా నోరు విప్పారు. ఆయన తన సోదరి జాన్వి కపూర్‌తో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్.. అర్జున్‌ను పెళ్లి గురించి అడిగారు.
‘ఎప్పుడు లవర్ గురించి ఫ్యామిలీకి చెబుతావు?’ అని ప్రశ్నించగా.. అర్జున్ తన సోదరి జాన్విని చూస్తూ.. ‘స్పష్టంగా.. ఇప్పుడే తెలిసింది’ అన్నారు. ‘పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా?’ అని అడగగా.. ‘అవును.. ఇప్పుడు చేసుకోవాలి అనుకుంటున్నా. గతంలో పెళ్లికి సిద్ధంగా లేను’ అంటూ అర్జున్ ప్రేమ గురించి స్పష్టత ఇచ్చారు.
ఇక అర్జున్‌తో పెళ్లి గురించి ఇటీవల మలైకాను మీడియా ప్రశ్నించగా.. ‘పర్శనల్ ప్రశ్నలకు నేనెప్పుడూ సమాధానం చెప్పను. నా జీవితం గురించి మాట్లాడటం నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. నా జీవితంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా.. అది చాలా అందంగా ఉంది’ అని చెప్పింది.