హిందీ లైఫ్ స్టయిలే వేరుగా ఉంటుంది . తమ కిష్టమని వారితోచెట్ట పట్టాలేసుకొని దర్జాగా పార్టీలను ,డిన్నర్లకు వెడుతుంటారు . మిగతా నగరాల్లోగా ఎవరికీ కనపడకుండా తిరగటం అనేది ఉండదు . ఇప్పుడు అర్జున్ కపూర్ , మలైకా అరోరా ప్రేమ జంట దీపావళి సందర్భంగా మంగళ వారం నాడు డిన్నరు చెయ్యడానికి వచ్చారు . చాలాకాలంగా వీరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. వాటిని అనధికారంగా ధ్రువీకరిస్తూ నిన్న బయటికి రావడంతో త్వరలో వీరు కూడా పెళ్లి పీటలు ఎక్కుతారనే వార్త వినిపిస్తోంది .
వీరిద్దరినీ చూసిన అభిమానులు చుట్టుముట్టారు , సెల్ఫీ లంటూ వేధిస్తుంటే వారి నుంచి మలైకాను తప్పిస్తూ అర్జున్ వెళ్లడం కనిపించింది .అంతలో మీడియా మిత్రులు కూడా హడావిడిగా వచ్చి ఫోటోలు తీసుకున్నారు . మలైకా తలా వంచుకొని నడుస్తుంటే , అర్జును ఆమె నడుం చుటూ చేయి వేసి నడిపించాడు .