గత సంవత్సరం అక్టోబర్ లో ఫిల్మ్ ,టెలివిషన్ ఇన్సిస్ట్యూట్ కు చైర్మన్ పదవిని చేపట్టిన చేపట్టిన బాలీ వుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈరోజు అనూహ్య పరిస్థితుల్లో రాజీనామా చేశాడు . సినీ నటుడుగా తీరిక లేకుండా వున్నాను , చైర్మన్ గా న్యాయం చేయలేను కాబట్టే రాజీనామా చేస్తునట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి రాజ్య వర్ధన్ కు పంపిన లేఖలో పేర్కొన్నాడు .
తన చిత్రాల షూటింగ్ కారణంగా అమెరికాలో 9 నెలలు పాటు వుండాల్చి వస్తున్నదని అందుకే తాను రాజీనా చేస్తున్నట్టు పేర్కొన్నాడు .కేవలం షూటింగ్ పనులవల్ల తీరిక లేక పోవడం , లేదా మరేదైనా రాజకీయ కారణం ఉందా అనేది తెలియ రాలేదు .