పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో చేసిన అమీషా పటేల్ గుర్తుంది కదా. ఆ సినిమా హిట్ కొట్టడంతో… ఈ అమ్మడు తరువాత అనేక తెలుగు సినిమాల్లో నటించింది. అయితే బద్రి మినహా మరో సినిమా ఆ స్దాయిలో హిట్ కాలేదు. దాంతో మెల్లిగా ఫేడవుట్ అయ్యింది.ఇక్కడ లాభం లేదని బాలీవుడ్ మకాం ఎత్తేసి అక్కడ కొంతకాలం వెలిగింది. అయితే కెరీర్ చక్కగా సాగుతున్న సమయంలో నిర్మాతగా మారి సినిమా మొదలెట్టి మునిగింది.
దేశీ మ్యూజిక్ పేరుతో సినిమా స్టార్ట్ చేసిన ఈ సినిమా ఆగిపోయింది. 2013 లో ఆగిన ఆ సినిమా విషయం ఆమె మర్చిపోయిందేమో కానీ అందుకోసం డబ్బు ఇచ్చిన వాళ్లు మర్చిపోలేదు. ఈ సినిమా కోసం ఫైనాన్షియర్ అజయ్ కుమార్ సింగ్ నుంచి మూడు కోట్ల రూపాయల ఋణం తీసుకుంది. ఆ రుణాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో అజయ్ కుమార్ సింగ్ కోర్టును ఆశ్రయించారు.
దానికి తోడు చెక్కు అమీషా పటేల్ ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో కేసును దాఖలు చేశారు. కోర్టు అమీషా పటేల్ కు నోటీసులు జారీ చేసింది. జులై 8 వ తేదీన ఆమె తప్పకుండా కోర్టుకు హాజరు కావాలి. అలా హాజరుకాని పక్షంలో ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంది.