జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’లో రామ్‌చరణ్‌కు జోడీగా సీత అనే పాత్రలో కనిపించబోతుంది ఆలియా. ఈ విషయాన్ని ఇప్పటికే రాజమౌళి అఫీషియల్ గా ప్రకటించేసారు. రామ్ చరణ్ కు జోడిగా ఆమె తెరపై మెగాభిమానులకు ఆనందం కలిగించబోతోంది. ఈ నేపధ్యంలో తెలుగునాట ఆమె ఒక్క రోజులో అందరికీ తెలిసిపోయింది.
కథల ఎంపిక విషయంలో ఖచ్చింతంగా ఉండే అలియా.. వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది. అందమే కాక అంతకు మించి మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంది అలియా.
రీసెంట్ గా 26వ పుట్టిన రోజు జరుపుకున్న అలియా.. ఈ సందర్భంగా తన పర్శనల్ హెల్పర్ , డ్రైవర్‌కు చెరో 25 లక్షల రూపాయల సాయం చేశారు. డ్రైవర్ సునీల్, వ్యక్తిగత సహాయకుడు అన్మోల్‌కు కలిపి రూ.50 లక్షల ఖరీదైన చెక్‌ను ఇచ్చారట అలియా. వారు సొంత ఇంటిని కొనుక్కునేందుకు గానే ఈ మొత్తాన్ని సాయం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే వీరిద్దరు జుహూ, ఖాన్ దందా ప్రాంతంలో ఇళ్లను బుక్ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీలోకి వచ్చిన నాటి నుంచి వీరు ఇద్దరు తన దగ్గరే పని చేస్తున్నారని.. వారి పట్ల తనకు గల ప్రేమను, కృతజ్ఞతను చాటుకోవడానికి అలియా ఇలా చేశారని తెలిసింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అలియా తెలుగు ఆర్ ఆర్ ఆర్ కాకుండా కళంక్, బ్రహ్మస్త్ర చిత్రాలతో బిజీగా ఉన్నారు.