డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నటి

రోజు రోజుకీ సినిమాలు, డ్రగ్స్ రెండు విడతీయలేని అనుబంధం పెంచుకుంటూ పోతున్నాయి. ఎన్ని అరెస్ట్ లు జరిగినా పోలీస్ లు ఎంత ఎలర్ట్ గా ఉన్నా వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు. డ్రగ్స్ ..సిని పరిశ్రమని ముంచెత్తోందని మీడియా,పోలీస్ ,ప్రభుత్వం వాపోవటం తప్ప కంట్రోలు చేయలేకపోతున్నారు. అయితే అప్పుడప్పుడూ ఆర్టిస్ట్ లు కొందరు డ్రగ్స్ తో దొరికిపోతూ అప్రతిష్టపాలువుతన్నారు.

తాజాగా మళయాళంలో ప్రముఖ టీవీ నటి, చిన్న సినిమాల హీరోయిన్ అశ్వతి బాబు తన డ్రైవర్ తో కలిసి డ్రగ్స్ ని తీసుకోవటం మరియు కలిగి ఉండటం నేరంపై అరెస్ట్ చేసారు. ఈ విషయమై కేరళ పోలీస్ డిపార్టమెంట్ అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది.

“అశ్వితి ఆమె డ్రైవర్ డ్రగ్స్ అమ్మటం కోసం ..ఓ కష్టమర్ కోసం వెయిట్ చేస్తూండగా వలపన్ని పట్టుకున్నాము. ఆమె ఇంటికి దగ్గరలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. MDMA డ్రగ్ చేతిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ,” అంటూ పోలీస్ డిపార్టమెంట్ మీడియాకు తెలియచేసింది.

ఈ అరెస్ట్ తో డ్రగ్ మాఫియాని కొంతవరకూ ఛేధించగలమని పోలీస్ లు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ మాఫియా ఎలర్ట్ అవుతుందని పోలీస్ డిపార్టమెంట్ భావిస్తోంది. MDMA పేరు గల ఈ డ్రగ్ లేట్ నైట్ పార్టీలలో ఎక్కువగా వాడుతూంటారు. మూడ్స్ ని ఇది కంట్రోలు చేస్తూంటుంది.