‘ప్రేమ పావురాలు’ ఫేం భాగ్యశ్రీ భర్త అరెస్ట్..!

సల్మాన్ ఖాన్ హీరోగా అప్పట్లో వచ్చిన ప్రేమ పావురాలు (‘మైనే ప్యార్‌ కియా’) లో హీరోయిన్ గా చేసిన భాగ్యశ్రీ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమా విజయంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ. తాజాగా భాగ‍్యశ్రీ భర్త హిమాలయ దాసానీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గ్లాంబింగ్‌ రాకెట్‌కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపార వేత్త అయిన హిమాలయాను అంబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్‌ మీద హిమాలయ విడుదలయ్యారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

మేనే ప్యార్‌ కియా తర్వాత చిన్ననాటి స్నేహితుడు హిమాలయా దాసానితో వివాహం అనంతరం ఆమె సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. భాగ్యశ్రీకి ఇద్దరు సంతానం. కుమారుడు అభిమన్యు దాసాని ‘మర్ద్‌ కో దర్ద్‌ నహీ హోతా’అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు.. ఈ ఏడాది మార్చిలో ఈ మూవీ రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే.